సుప్రసిద్ద శైవక్షేత్రం శ్రీశైల మల్లికార్జున స్వామికి గురువారం సహస్ర కలశాభిషేకం ఘనంగా జరిగింది. ఈ నెల 23 నుంచి శ్రీశైలంలో వరుణజపం నిర్వహించి, గురువారం మల్లికార్జున స్వామికి 1116 కలశాలతో అభిషేకం నిర్వహించారు. వేదపండితులు, అర్చకులు, కృష్ణానదికి వెళ్లి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పవిత్ర జలాన్ని కలశాలలో తెచ్చారు. నంది మండపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ పవిత్ర జలంతో మల్లికార్జున స్వామికి కలశాభిషేకం నిర్వహించారు.ఇకపోతే.. గురువారం శ్రీశైల మల్లన్నకు జరిగిన పవిత్రమైన సహస్ర కలశాభిషేకంలో అనేకమంది భక్తులు పాల్గొన్నారు. అభిషేక అనంతరం దివ్య సుందరంగా అలంకరించబడిన మల్లికార్జున స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. |