ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > బోనాలు ప్రారంభం: ఘనంగా ఘటాల ఊరేగింపు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
బోనాలు ప్రారంభం: ఘనంగా ఘటాల ఊరేగింపు
FILE
తెలంగాణ ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకునే గోల్కొండ బోనాల ఉత్సవం జంటనగరాల్లో వైభవంగా ప్రారంభమైంది. వచ్చేనెల 23వరకు జరిగే ఈ బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతి గురు, ఆదివారాల్లో జగదాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

గోల్కొండ కోటపై వెలసిన అమ్మలగన్న అమ్మ జగదాంబ అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవం గురువారం ఘనంగా ఆరంభమైంది. ఈ ఉత్సవాల్లో భాగంగా.. ఏడుగురు అక్కచెల్లెల్లలో పెద్దదైన జగదాంబ మాత ఘటోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.

పోతురాజుల నృత్యాలు, బ్యాండ్ మేళాలు, డప్పుచప్పళ్లు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం రథాలు, ఘటాల వూరేగింపులు ఘనంగా జరిగాయి. లంగర్ హౌస్ నుంచి జూల తీసుకురాగా, చోటీ బజార్ నుంచి అమ్మవారి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు.

ఈ ఘటాల ఊరేగింపులో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. బోనాలను పురస్కరించుకుని పోలీసు శాఖ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఘనంగా మల్లికార్జున స్వామికి కలశాభిషేకం
బోనాల ఉత్సవాలు నేటినుంచే
పూరీలో కదలనున్న జగన్నాథుని రథచక్రాలు
ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర
వెంకన్నకు కానుకగా స్వర్ణపాత్ర
25నుంచి గోల్కొండ బోనాలు ప్రారంభం