ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > వార్తలు > లండన్‌‌లో కన్నుల పండుగగా జరిగిన "రథయాత్ర"
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
లండన్‌‌లో కన్నుల పండుగగా జరిగిన "రథయాత్ర"
PTI
లండన్‌లో జరిగిన జగన్నాథ రథయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. గత బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు పూరీలో ప్రారంభమైన జగన్నాథ రథ యాత్రకు దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం లండన్‌లో జగన్నాథ రథయాత్ర కన్నుల పండుగగా జరిగింది.

40 అడుగుల ఎత్తైన మూడు రథ చక్రాలు కదిలిన వైనాన్ని వీక్షించిన వేలాది మంది భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. లండన్‌లోని హైడ్ పార్క్ నుంచి ట్రఫ్లర్గర్ స్క్వార్ వరకు జరిగిన ఈ యాత్రలో గాయకుల భక్తి గానాలు, సాంస్కృతిక నృత్యప్రదర్శన భక్తులను పెద్ద ఎత్తున ఆకట్టుకున్నాయి.

ఇదిలా ఉండగా.. భువనేశ్వర్‌లోని పూరీలో పన్నెండు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగే జగన్నాథ రథోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. దీనికోసం 45 అడుగుల ఎత్తుతో 16 చక్రాలతో జగన్నాథుని రథం, 44 అడుగుల ఎత్తుతో 14 చక్రాలతో బలభద్రుని రథం, 43 అడుగుల ఎత్తుతో 12 చక్రాలతో సుభద్ర రథాలను సిద్ధం చేశారు.

12 రోజులపాటు జరిగే ఈ రథయాత్రకు అత్యధిక సంఖ్యలో తరలి వస్తున్న భక్తకోటికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను చేసింది. గతంలో జరిగిన రథయాత్రలో తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో.. ఈ ఏడాది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు పోలీసు యంత్రాంగం ఓ ప్రకటనలో తెలిపింది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
తిరుమల భద్రతపై అత్యున్నత సమావేశం
బోనాలు ప్రారంభం: ఘనంగా ఘటాల ఊరేగింపు
ఘనంగా మల్లికార్జున స్వామికి కలశాభిషేకం
బోనాల ఉత్సవాలు నేటినుంచే
పూరీలో కదలనున్న జగన్నాథుని రథచక్రాలు
ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర