శ్రీ జంగ్లీ విఠోబ దేవాలయంలో ఆషాఢ శుద్ధ దశమి గురువారం నుండి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఉస్మాన్‌షాహి విఠల్ నగర్‌లోని ఈ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని భారీ సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీ విఠలేశ్వర బాల భక్త సమాజం అధ్యక్షులు వి. కిషన్ యాదవ్ సభ్యులు రాజుమహరాజ్ మాట్లాడుతూ.. నవరాత్రి ప్రారంభోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం స్వామివారికి మహాభిషేకం జరుగుతుందని తెలిపారు. పండరిపురంలో తొలి ఏకాదశి రోజున నిర్వహించే శ్రీ విఠలేశ్వరుని రథోత్సవంతో హిందువుల పండుగలు ప్రారంభం కావడం ఆనవాయితీగా వస్తుందని రాజు మహారాజ్ వెల్లడించారు. ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన అన్నారు. |