సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంగా ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఈవో గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. 21వ తేదీ సాయంత్రం 6.30 గంటల నుంచి 22వ తేదీ ఉదయం 7.20 వరకు ఆలయాన్ని మూసివేస్తామని ఆయన చెప్పారు.ఇదిలా ఉండగా.. ఈ నెల 22న సంభవించే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని భారతదేశంలోని తూర్పు, మధ్య, పశ్చిమ, ఈశాన్య ప్రాంత ప్రజలు వీక్షించగలుగుతారని ఖగోళశాస్త్రజ్ఞులు తెలిపారు. 21 వ శతాబ్దపు అరుదైన ఈ సంపూర్ణ సూర్యగ్రహణం.. భారతీయ కాలమానం ప్రకారం 22వ తేదీ ఉదయం 5.28 గంటలకు మొదలవుతుంది. 10.42 గంటలకు ముగుస్తుంది. గ్రహణం సంపూర్ణ దశ మూడు నిమిషాల ముప్ఫై సెకండ్లని కోల్‌కతా ఎంపీ బిర్లా ప్లానిటోరియం డైరక్టర్ డీపీ దువారీ తెలిపారు. |