నవ సమాజం కోసం కృషి చేద్దామని అఖిల భారత జైన్ సమాజం దేశ ప్రజలకు పిలుపునిచ్చింది. ఆ సంస్థ అఖిల భారత స్వాథంబర్ స్తానక్‌వాసీ (ఏఐఎస్ఎస్) సంస్థ జాతీయ మహానాడు చెన్నయ్‌లో తాజాగా జరిగింది. ఈ మహానాడుకు వహించిన ఏఐఎస్ఎస్ కొత్త అధ్యక్షుడు కేసరిముల్జీ భరత్ అధ్యక్షత వహించారు. అలాగే, జాతీయ సలహాదారు నేమిచంద్ చోప్రా, మాజీ అధ్యక్షుడు బి.హెచ్.జైన్, ప్రధాన కార్యదర్శి విమల్‌చంద్, ఉపాధ్యక్షుడు బ్రాస్ సాజత్‌తో సహా పలువురు పాల్గొన్నారు.
అలాగే, ఈ మహానాడులో రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా మహావీర్ చంద్ కాంన్‌కిరియా బాధ్యతలు స్వీకరించారు. ఇందులో ఏఐఎస్ఎస్ మహిళా విభాగంతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న జైన్ సమాజం కార్యకర్తలు, నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని ఆ సమాజం జాతీయ ప్రతినిధి ప్రశాంత్ కుమార్ సంశెట్టి సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన జైన్ సమాజ్‌కు చెందిన ప్రతినిధులు పలువురు ప్రసంగిస్తూ.. నవ సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్క పౌరుడు తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే వారికి ఆశ్రయం కల్పించరాదని వారు కోరారు. దేశంలోని ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా మెలిగాలని వారు పిలుపునిచ్చారు.