హిందూ | క్రైస్తవ | ఇస్లాం | పండుగలు | కథనాలు | వార్తలు | ప్రాంతాలు | ప్రార్థన | దేవీ నవరాత్రి ఉత్సవాలు | వెండివెలుగుల దీపావళి | భగవాన్ శ్రీ సత్యసాయి | శ్రీకృష్ణాష్టమి | వినాయక చవితి | శ్రీరామనవమి
ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » వార్తలు » పూర్ణాహుతితో ముగిసిన కరీరిష్టి యాగం (Tirumala| Tirupati| Sunday| TTD| Chairman)
 
Sri Varu
FILE
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో లోకకళ్యాణార్థం, రాష్ట్రం సుభిక్షింగా ఉండాలని ఆకాంక్షిస్తూ నిర్వహించిన కరీరిష్టి యాగం ఆదివారం పూర్ణాహుతితో సమాప్తమైంది. పంచవృత దీక్షతో నిర్వహించిన ఈ యాగంలో నలుగురు ప్రధాన రుత్వికులు, ఓ యజమాని దంపతులు పాల్గొన్నారు.

పార్వేట మండపం వేదికగా ఐదు రోజులపాటు చిర్రావూరి శ్రీరామశాస్త్రి ఆధ్వర్యాన ఈ యాగం సాగింది. ప్రతి ఏటా అవసరమైన మేర వర్షాలు కురిసేలా వరుణుడిని ఆవాహన చేయడమే ఈ కత్రువు ధ్యేయమని పండితులు చెప్పారు.

తిరుమలలో గత నాలుగేళ్లుగా ఈ క్రతువు కొనసాగుతోందని టీటీడీ ఛైర్మన్ అన్నారు. ఈ ఏడాది రుతుపవనాల సంచారం సవ్యంగా లేక వర్షాలు కురవకపోవడంతో, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆశిస్తూ ఈ యాగాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.