సుప్రసిద్ధ శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో ఆదివారం చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. చిత్తూరు జిల్లాలోని వినాయక స్వామిని గణేశ చతుర్థినాడు వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు.
వినాయక చవితి రోజైన ఆదివారం ఉదయాన్నే మూలవిరాట్‌కు ప్రత్యేకాభిషేకాలు, అనివేటి మండపంలో ఉత్సవర్ల వద్ద వినాయక వ్రతం, నీరాజన మంత్ర పుష్పాలను సమర్పిచారు.
వరసిద్ధుని బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున మంత్రి గల్లా అరుణకుమారి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వినాయక చతుర్థిని పురస్కరించుకుని దాతల సహకారంతో చేపట్టిన నిత్యాన్నదానం పథకాన్ని మంత్రి అరుణ కుమారి ప్రారంభించారు.
ఈ పథకం ద్వారా రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులకు భోజన సదుపాయం కల్పిస్తారని ఆలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.