ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » వార్తలు » త్వరలోనే శ్రీవారి ఆలయం స్వర్ణమయం: ఛైర్మన్ (Tirumala| Tirupati| Sri Venkateswara Swamy| Swarna Mayam| Dalita Govindam| KalyanaMasthu)
తిరుమల శ్రీవారి ఆలయం త్వరలోనే స్వర్ణమయం కాగలదని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ డి.కె. ఆదికేశవులు ఆశాభావం వ్యక్తం చేశారు.
పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది గడిచిన సందర్భంగా ఆదికేశవులు విలేకరులతో మాట్లాడుతూ.. తొలి సంవత్సరంలో దళిత గోవిందం, కళ్యాణమస్తు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించనున్నామని చెప్పారు.
అలాగే చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద 700 ఎకరాల్లో గో సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేశామని, దీనివల్ల తిరుమలలో భక్తులకు ఉచితంగా పాలు పంపిణీ చేసేందుకు వీలవుతుందని ఛైర్మన్ అన్నారు. అనంత స్వర్ణమయం పథకం కింద పనులు శరవేగంగా పూర్తిచేస్తామని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
ఇకపోతే.. శ్రీవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించిన శ్రీ కృష్ణదేవరాయల పంచశత ఘట్టాభిషేక మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఛైర్మన్ ఆదికేశవులు వెల్లడించారు.