షిర్డీసాయిబాబాకు ముంబైకి చెందిన ఓ అజ్ఞాత భక్తుడు 1.3 కోట్ల రూపాయల విలువగల వజ్ర కిరీటాన్ని సమర్పించారు. అయితే తన పేరును రహస్యంగా ఉంచాలని దేవస్థాన పాలకమండలి కోరారు. దీంతో కేంద్ర మంత్రి విలాస్ రావ్ దేశ్‌ముఖ్ ఆ కిరీటాన్ని సోమవారం గుడికి అందజేశారు.
ఇదిలా ఉంటే.. షిర్డీ గ్రామస్తుల నుంచి వ్యతిరేకత రావడంతో సాయిబాబా లోహపాదుకలను అమెరికా తీసుకెళ్లాలన్న నిర్ణయాన్ని బోర్డు ఉపసంహరించుకుంది.
మరోవైపు.. గురువారం షిర్డీ సాయిబాబాకు ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నట్లు ఆలయ బోర్డు ఓ ప్రకటనలో తెలియజేసింది. గురువారాన్ని పురస్కరించుకుని సాయిబాబాను దర్శించుకునే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.