కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ డి.కె. ఆదికేశవులు సతీమణి రత్నప్రభ రెండు కిలోల బంగారాన్ని విరాళంగా అందజేశారు.
శ్రీవారి ఉత్సవర్ల విహారం కోసం ఆదికేశవులు, నిరుడు సూర్యప్రభ వాహనం బహూకరించారు.
అయితే దీని బరువు అధికం కావడంతో ఉత్సవాల్లో వినియోగించడం వీలుకాలేదు. దీంతో బంగారు రేకు అమర్చడం ద్వారా ఈ వాహనం బరువు తగ్గించాలని నిర్ణయించారు.
ఇందుకుగాను.. ఐదు కిలోల బంగారం అవసరం కాగా, ఇప్పటికే రెండు కిలోల బంగారం అందజేసిన రత్నప్రభ.. మిగిలిన మూడు కిలోల బంగారం కూడా తామే ఇస్చామని ప్రకటించారు.
ఇదిలా ఉంటే.. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసేందుకు తితిదే యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.