హిందూ | క్రైస్తవ | ఇస్లాం | పండుగలు | కథనాలు | వార్తలు | ప్రాంతాలు | ప్రార్థన | దేవీ నవరాత్రి ఉత్సవాలు | వెండివెలుగుల దీపావళి | భగవాన్ శ్రీ సత్యసాయి | శ్రీకృష్ణాష్టమి | వినాయక చవితి | శ్రీరామనవమి
ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » వార్తలు » కామధేనువుపై ఊరేగిన కాణిపాకం వినాయకుడు (Kanipakam| Vinayaka Swamy| Vara siddhi Vinayaka| Devotees)
 
Ganesh
WD
కాణిపాకం వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. గురువారం రాత్రి స్వామివారు కామధేనువాహనంపై ఊరేగారు.

ఇందులో భాగంగా సిద్ధి, బుద్ధి సమేతుడైన వరసిద్ధి వినాయకస్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాంగసుందరంగా అలంకరించి, ఆలయ అన్వేటి మండపంలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పురవీధుల్లో ఊరేగిన విఘ్నేశ్వరుడిని తిలకించిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు.

గురువారం ఉదయం స్వామివారి మూలవిగ్రహానికి, ఉత్సమూర్తులకు ప్రధాన ఆలయంలో సంప్రదాయబద్ధంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు.

కాణిపాకంలో జరుగుతోన్న బ్రహ్మోత్సవాలకు భారీ ఎత్తున భక్తులు తరలివస్తున్నారని, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వసతి సౌకర్యాలను కల్పించినట్లు ఆలయ బోర్డు అధికారులు ఓ ప్రకటనలో తెలియజేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.