కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వర ఆలయంలోని ఘంటానాదం ఈ నెల 21వ తేదీ నుంచి జగద్వాపితం కానుందని ఈవో ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు.
ఎస్వీ భక్తి ఛానెల్ ఆధ్వర్యంలో రెండు రోజులుగా తిరుపతిలో జరుగుతోన్న ఎంఎస్‌వోలు, కేబుల్ ఆపరేటర్ల రాష్ట్రసాయి సమావేశం బుధవారంతో ముగిసింది.
ఈ సభలో ఈవో ప్రసంగిస్తూ.. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 5.30కి, సాయంకాలం 7.30 నుంచి 7.45 గంటల మధ్య భక్తి ఛానెల్ ద్వారా ఘంటానాదాన్ని ప్రసారం చేస్తామన్నారు. ధార్మిక కార్యక్రమాల ప్రసారానికి ఆపరేటర్లు సహకరించాలని ఈవో పిలుపునిచ్చారు.
ఇదిలా ఉంటే.. దీపావళి సెలవు దినాల్లో తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని తితిదే అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అన్ని సదుపాయాలను కల్పించేందుకు తితిదే యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేస్తోంది.