హిందూ | క్రైస్తవ | ఇస్లాం | పండుగలు | కథనాలు | వార్తలు | ప్రాంతాలు | ప్రార్థన | దేవీ నవరాత్రి ఉత్సవాలు | వెండివెలుగుల దీపావళి | భగవాన్ శ్రీ సత్యసాయి | శ్రీకృష్ణాష్టమి | వినాయక చవితి | శ్రీరామనవమి
ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » వార్తలు » తిరుమలేశునికి కానుకగా 20 కిలోల స్వర్ణ పీతాంబరం (Tirumala| Tirupati| Sri venkateswara| Gold Pitabaram| 20 Kgs| Nellore MP)
Feedback Print Bookmark and Share
 
Venki
FILE
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి 20 కిలోల స్వర్ణ పీతాంబరాన్ని నెల్లూరు ఎంపీ, మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు మేకపాటి రాజమోహన రెడ్డి కానుకగా సమర్పించారు. గురువారం రాత్రి ఆలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో రూ. 37కోట్ల విలువగల ఈ పీతాంబరాన్ని టీటీడీ ఈవో కృష్ణారావుకు అందజేశారు.

శ్రీవారి మూలవిరాట్టు నాభిభాగానికి దిగువన ఈ పీతాంబరాన్ని ధరింపజేస్తారు. గతంలో 20 కిలోల బంగారంతో టీటీడీ సొంతంగా తయారు చేయించిన పీతాంబరాన్ని ఇప్పటిదాకా అలంకరిస్తున్నారు. దీంతో వెంకన్న స్వామికి రాజమోహన రెడ్డి సమర్పించిన స్వర్ణ పీతాంబరం రెండోది కావడం విశేషం.

ఈ స్వర్ణ పీతాంబరాన్ని చెన్నైలో ఐదుగురు నిపుణులు ఐదు నెలలపాటు శ్రమించి తయారు చేశారని ఎంపీ రాజమోహనరెడ్డి చెప్పారు. తన పెద్ద కుమారుని కోరిక మేరకు ఈ కానుకను వెంకన్న స్వామికి సమర్పించినట్లు ఆయన తెలిపారు. ఇంకా దీని బరువు 20.785కేజీలు కాగా, ఎత్తు 3.75 అడుగులు.

24 క్యారెట్ల బంగారంతో తయారైన ఈ పట్టు పీతాంబరాన్ని శుక్రవారం వేకువజామున అభిషేక సేవ అనంతరం స్వామివారికి అలంకరించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.