హిందూ | క్రైస్తవ | ఇస్లాం | పండుగలు | కథనాలు | వార్తలు | ప్రాంతాలు | ప్రార్థన | దేవీ నవరాత్రి ఉత్సవాలు | వెండివెలుగుల దీపావళి | భగవాన్ శ్రీ సత్యసాయి | శ్రీకృష్ణాష్టమి | వినాయక చవితి | శ్రీరామనవమి
ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » వార్తలు » 26న తిరుమల మలయప్పస్వామికి పుష్పయాగం (Tirumala| Tirupati| Sri Venkateswara Swamy| Pushpayagam| Karthika Masam| Sravana Nakshatra)
Feedback Print Bookmark and Share
 
Venky
WD
అఖిలాండ బ్రహ్మాండనాయకుడు తిరుమల వెంకటేశ్వరుని ఆలయంలో ఈ నెల 26వ తేదీన పుష్పయాగం నిర్వహించనున్నారు.

ఈ పుష్పయాగానికి 25వ తేదీన అంకురార్పణ చేస్తారు. వార్షిక బ్రహ్మోత్సవాల అనంతరం కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రంనాడు ప్రతిఏటా మలయప్ప స్వామికి పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ.

ఆ రోజున యథావిధిగా రెండు అర్చన, నివేదన కైంకర్యాల తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని కళ్యాణ మంటపానికి వేంచేపు చేస్తారు. అక్కడ హోమాలు, స్నపన తిరుమంజనం పూర్తిచేసి, మధ్యాహ్నం వివిధ రకాల సుగంధభరిత పుష్పాలతో స్వామివారిని అర్చిస్తారు. ఈ సందర్భంగా పుష్పరాశి ఉత్సవర్ల హృదయభగం వరకు రాగానే వాటిని తొలగించి, అర్చన పునఃప్రారంభిస్తారు. ఇలా 20 పర్యాయాలు నిర్వహించి, హారతి సమర్పిస్తారు.

పుష్పయాగాన్ని పురస్కరించుకుని 25న తోమాల-అర్చన, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణలను, యాగంనాడు విశేషపూజ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలను రద్దు చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.