హిందూ | క్రైస్తవ | ఇస్లాం | పండుగలు | కథనాలు | వార్తలు | ప్రాంతాలు | ప్రార్థన | దేవీ నవరాత్రి ఉత్సవాలు | వెండివెలుగుల దీపావళి | భగవాన్ శ్రీ సత్యసాయి | శ్రీకృష్ణాష్టమి | వినాయక చవితి | శ్రీరామనవమి
ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » వార్తలు » తిరుమలలో నేటినుంచి శీఘ్రదర్శనం అమలు: తితిదే (Tirumala| Tirupati| Sri Venkateswara Swamy| Devotees)
Feedback Print Bookmark and Share
 
Venky
WD
కలియుగ వైకుంఠధామం శ్రీ తిరుమలేశుని ఆలయంలో శీఘ్ర దర్శనాన్ని అమలు చేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తుల కోసం బుధవారం నుంచి శీఘ్ర దర్శనాన్ని అమలుచేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు చెప్పారు.

బుధవారం శీఘ్రదర్శనాన్ని ప్రారంభించిన సందర్భంగా కృష్ణారావు, ఆదికేశవులు నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల వైకుంఠం-1 కాంప్లెక్స్ ప్రవేశం ద్వారం వద్ద ఇందుకోసం ప్రత్యేకంగా రెండు కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. రూ. 300 చెల్లించి ఎలాంటి సిఫారసు లేకుండా ఏ సమయంలోనైనా ఈ టికెట్‌ను పొందవచ్చునని వారు తెలిపారు.

ఇకపోతే.. శీఘ్రదర్శనం అమలు చేయడంతో బుధవారం నుంచి అర్చనానంతర దర్శనం, సెల్లార్ టిక్కెట్లను టీటీడీ రద్దు చేసింది. శీఘ్రదర్శనం ద్వారా ఇకపై సిఫారసు లేకుండా వైకుంఠం క్యూకాంప్లెక్స్ ఎదురుగా ఉన్న కౌంటర్లలో ఈ టిక్కెట్లను పొందవచ్చు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.