హిందూ | క్రైస్తవ | ఇస్లాం | పండుగలు | కథనాలు | వార్తలు | ప్రాంతాలు | ప్రార్థన | దేవీ నవరాత్రి ఉత్సవాలు | వెండివెలుగుల దీపావళి | భగవాన్ శ్రీ సత్యసాయి | శ్రీకృష్ణాష్టమి | వినాయక చవితి | శ్రీరామనవమి
ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » వార్తలు » నాగులచవితి నాడు పెద్దశేష వాహనంపై ఊరేగిన శ్రీవారు (Tirupati| Tirumala| Sri venkateswara Swamy| Nagula Chavithi| Pedda Sesha vahanam| Devotees)
Feedback Print Bookmark and Share
 
Pedda Sesha Vahanam
WD
నాగులచవితిని పురస్కరించుకుని గురువారం నాడు మలయప్పస్వామి పెద్దశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగారు. ప్రతి ఏటా నాగులచవితి రోజున కోనేటి రాయుడైన శ్రీవారిని పెద్దశేష వాహనంపై ఊరేగించడం ఆనవాయితీ. అలాగే గురువారం వాహన సేవకు ముందు స్వామివారి ఉత్సవర్లకు ప్రత్యేక పూజలు పూర్తి చేశారు.

అనంతరం వాహన మండపాని వేంచేపుగా తీసుకువచ్చి, ఉత్సవర్లను పెద్దశేష వాహనంపై ఆసీనులను చేశారు. గురువారం రాత్రి జరిగిన ఈ వాహన సేవలో వేలాది మంది భక్తులు వెంకన్న స్వామిని దర్శించుకున్నారు.

అగ్రభాగాన బ్రహ్మరథ సారథ్యంలో గో, గజ, అశ్వరాజాలతో ఉభయనాంచారులతో మలయప్పస్వామి ఊరేగిన వైనాన్ని తిలకించిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. దీనికి తోడు భక్తుల గోవిందనామస్మరణతో తిరుమల కొండ మారుమ్రోగింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.