ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » వార్తలు » సర్వదర్శనంతో పోలిస్తే శీఘ్రదర్శనం ఎంతో మేలు: ఈవో (Tirumala| Tirupati| Sri Venkateswara Swamy| Sheegra Darshan| Sarva Darshan| Tourism)
శ్రీవారి దర్శనార్థం బుధవారం ప్రారంభించిన శీఘ్రదర్శనాన్ని సర్వదర్శనంతో పోలిస్తే ఎంతో మెరుగైందని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో కృష్ణారావు అన్నారు. శీఘ్రదర్శనంపై వస్తున్న విమర్శలు కేవలం అపోహలు మాత్రమేనని ఆయన కొట్టిపారేశారు.
శుక్రవారం కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ, స్వామివారి నిజరూప దర్శనానికి ఇండియన్ రైల్వే, ఏపీ టూరిజానికి 1000 టిక్కెట్లను భరోసా పద్ధతిలో కేటాయిస్తామని చెప్పారు.
శుక్రవారం శ్రీవారికి జరుగనున్న నిజపాద దర్శనం కోసం ఏపీ టూరిజం, రైల్వేవారి తరపున ఐఆర్‌సీటీసీ కోటాలో కొన్నివేల టిక్కెట్లను ముందుగానే సిద్ధం చేసింది. ఈ విషయమై ఈవో మాట్లాడుతూ.. స్వామివారి నిజరూప దర్శనాన్ని పూర్తిగా రద్దు చేయలేదన్నారు. కొంతమేరకు మాత్రమే తగ్గించినట్లు ఈవో తెలిపారు.