మంత్రాలయం రాఘవేంద్ర స్వామి పుణ్యక్షేత్రంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు.
వరదల వల్ల కర్నూలు జిల్లాలోని మంత్రాలయం క్షేత్రం తీవ్రంగా దెబ్బతిందని, ఈ ఆలయాన్ని పునరుద్ధరించడంపై తగిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు రాఘవేంద్ర మఠం పీఠాధిపతి సుయతీంద్ర తీర్థకు రోశయ్య హామీ ఇచ్చారు.
శుక్రవారం బెంగళూరు పర్యటన సందర్భంగా.. రోశయ్య ఎయిర్‌పోర్ట్ నుంచి నేరు గా టీటీడీ ఛైర్మన్ ఆదికేశవులు నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో సుయంతీంద్ర తీర్థ కూడా అక్కడే ఉండటంతో ఆయన ఆశీస్సులను కూడా ముఖ్యమంత్రి స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రాలయం ఇంకా బురదమయంగానే ఉందని, దాన్ని బాగుచేయాలని స్వామి కోరారు.
ఇంకా కర్ణాటక నుంచి మంత్రాలయానికి ప్రధాన అనుసంధాన మార్గమైన మాధవరం వంతెనను పునరుద్ధరించాలని యడ్యూరప్ప కోరినట్లు తెలిసింది.