శ్రీశైలం భ్రమరాంబికాదేవికి 108 బంగారు కలువ పువ్వులు కానుకగా అందాయి. హైదరాబాద్‌కు చెందిన వై.వి. సుబ్బారెడ్డి, స్వర్ణలత దంపతులు బుధవారం 108 బంగారు కలువ పువ్వులను అమ్మవారికి కానుక సమర్పించారు.
330 గ్రాముల బరువున్న ఈ సువర్ణ కలువ విలువ ఐదు లక్షల రూపాయలుంటాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ పుష్పాలను అమ్మావారి నిత్యపూజకు వినియోగిస్తామని ఆలయ ఈవో గోపాలకృష్ణారెడ్డి వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. కార్తీక శుద్ధ ఏకాదశి (నేడు)ని పురస్కరించుకుని గురువారం శ్రీశైలంతో పాటు రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కార్తీక మాసంలో శైవక్షేత్ర సందర్శన పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుందని, ముఖ్యంగా కార్తీక తొలి ఏకాదశి రోజున శివారాధన చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు.