తిరుమలలో శుక్రవారం కైశిక ద్వాదశి ఆస్థానం వైభవంగా ముగిసింది. కార్తీకమాసంలో వచ్చే తొలి ద్వాదశి రోజున కైశిక ద్వాదశి ఆస్థానం నిర్వహించడం ఆనవాయితీ.
ఇంకా తెల్లవారుజామునే సూర్యోదయానికి పూర్వమే ఈ వేడుకను పూర్తి చేయడం మరో ప్రత్యేకత. ఇందులో భాగంగా.. శుక్రవారం ఉభయ నాంచారుల సమేత ఉగ్రశ్రీనివాసమూర్తిని దివ్య సుందరంగా అలంకరించి తిరుమాడవీధుల్లో ఊరేగించారు.
తెల్లవారుజామున మొదలయ్యే ఈ వేడుకలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఇంకా చెప్పాలంటే.. వేడుకలో పాల్గొనే ఉగ్ర శ్రీనివాసునిని భరించడం కష్టమని పండితులు అంటారు. అందుకే సూర్యోదయానికి ముందే స్వామివారిని తిరుమాడవీధుల్లో ఊరేగించి.. ఆలయంలోకి వేంచేపు చేస్తారని వారు చెప్పారు.