ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » వార్తలు » శ్రీవారి ఆభరణాల పరిరక్షణకు ప్రత్యేక సంస్థ: మంత్రి (Tirumala| Tirupati| Sri Venkateswara Swamy| Devotees| Rains)
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమలేశునికి చెందిన బంగారం, వెండి ఆభరణాల విలువను అంచనా వేసేందుకు, వాటి పరిరక్షణార్థం కొత్తగా ఓ ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి చెప్పారు.
దేవాలయ భూముల ఆక్రమణను నివారించేందుకు, ఆస్తులను పరిరక్షించేందుకు వీలుగా జనవరి నుంచి ఒక జ్యుడిషియల్ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేస్తామని వెంకటరెడ్డి విలేకరుల సమక్షంలో వెల్లడించారు. ఈ ట్రిబ్యునల్‌పై హైకోర్టులోనే అప్పీలు చేసుకోవాల్సి ఉంటుందని, అందులో ప్రభుత్వ జోక్యం ఉండదని మంత్రి వివరించారు.
ఇదిలా ఉంటే.. ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో తిరుమల కొండపై ఎటుచూసిన పొగమంచు ఆవరించింది. వర్షం వల్ల భారీ వృక్షాలు పడిపోవడంతో వాటికింద ఉంచిన యాత్రికుల వాహనాలు ధ్వంసమవుతున్నాయి. దీంతో భక్తులు, యాత్రికులు నానా తంటాలు పడుతున్నారు.