పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఈ మాసంలో వచ్చే సోమ, శుక్రవారాల్లో మల్లికార్జున స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో మల్లేశ్వరునికి పెన్నా సిమెంట్స్ అధినేత పి. ప్రతాపరెడ్డి రూ. 10.40 లక్షల విలువైన స్వర్ణాభరణాలను కానుకగా సమర్పించారు. ఈ మేరకు ఆయన సతీమణి లక్ష్మి గురువారం ఆలయ అధికారి బ్రహ్మయ్యకు వాటిని అందజేశారు.
ఇందులో భ్రమరాంబికాదేవికి రూ. 7.75లక్షల విలువైన 471 గ్రాముల మామిడి పిందెల హారం, మల్లికార్జున స్వామికి రూ. 2,65,500లతో 161 గ్రాముల బిల్వపత్రహారంలు ఉన్నాయని ఆలయ అధికారులు తెలిపారు.