కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తుల నుంచి కానుకలు వెల్లువల్లా వస్తున్నాయి. ఆఫ్రికాలో స్థిరపడిన చెన్నై వాసి, అశ్విని ఇండస్ట్రీస్ డైరక్టర్ ఎస్. శౌరి రాజన్ రూ.6లక్షల విలువైన స్వర్ణ శఠారిని శ్రీవారికి కానుకగా అందజేశారు. 600 గ్రాముల బంగారుతో చేసిన ఈ శఠారిని శనివారం ఆలయంలో టీటీడీ అధికారులకు అందజేయనున్నారు.
ఇదిలా ఉంటే.. శ్రీవారి ఆలయంలో ప్రతి బుధవారం నిర్వహించే సహస్ర కలశాభిషేకం ఆర్జిత సేవను ఇప్పట్లో రద్దుచేసే ప్రసక్తే లేదని టీటీడీ ఈవో కృష్ణారావు స్పష్టం చేశారు. 2028 నాటికి రిజర్వ్ చేసుకున్న సహస్ర కలశాభిషేకం టిక్కెట్లు రద్దవుతాయన్న సంశయం తలెత్తిన నేపథ్యంలో.. సహస్రకలశాభిషేకం రద్దుచేయబోమని భరోసా ఇచ్చారు.