శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మండలం, జ్యోతిపూజలు ప్రారంభమయ్యాయి. ఈ వివరాలను దేవస్థానం ఓ ప్రకటనలో తెలియజేసింది. బుధవారం సాయంత్రం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమాలు జనవరి 14వ తేదీవరకు కొనసాగుతాయి.
పూజల వివరాలకెళితే.. 11వతేదీ సాయంత్రం 5.30 గంటలకు తిరునాడ ప్రారంభమైంది. అలాగే 13వతేదీ ఉదయం 11.30 నుంచి కుంభాభిషేకం, 14న చితిరి అట్టతిరునాళ్, 15వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు మండల పూజోత్సవాల ప్రారంభం, 26-12-09న మండలపూజ, 30-12-09 సాయంత్రం 5.30 గంటలకు తిరునాడ ప్రారంభం, జనవరి 14వ తేదీన మకరవిలక్కు వంటి కార్యక్రమాలుంటాయని దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది.