పట్టుదల, ఆత్మవిశ్వాసం, నిరంత శ్రమతో అనుకున్న కార్యాన్ని సాధించవచ్చునని స్వామి చిదాత్మానంద చెప్పారు. పట్టుదలతో అడుగేసి తీవ్రంగా శ్రమిస్తే లక్ష్యసాధన సాధ్యమని స్వామీజీ ప్రబోధించారు.
ఎన్టీఆర్ భవన్‌లో స్వామి చిదాత్మానంద ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వామి ప్రసంగించారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దంపతులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రపంచానికే ఆధ్యాత్మిక శక్తి ప్రసాదించే సామర్థ్యం భారత్‌కు మాత్రమే ఉందని చెప్పారు.