తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభం కానున్నాయి.తొమ్మిది రోజుల పాటు నిర్విరామంగా జరుగనున్న ఈ బ్రహ్మోత్సవాలు శుక్రవారం ధ్వజారోహణంతో ఆరంభమవుతాయి.
అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టే దిశగా ధ్వజారోహణం ముందు రోజు సాయంత్రం అంకురార్పణం నిర్వహించడం ఆనవాయితీ. గురువారం సాయంత్రం అమ్మవారి ఉద్యానవనంలో సేకరించిన పుట్టమట్టిని శాస్త్రోక్తంగా ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం నవధాన్యాలను అందులో వేసి అంకుర్పారణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తొమ్మిది రోజుల పాటు ఎలాంటి అవరోధాలు, ఆటంకాలు లేకుండా నిర్విరామంగా బ్రహ్మోత్సవాలు జరిగేందుకు ఆలయంలో అంకురార్పణ నిర్వహించడం ఆనవాయితీ.