ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » వార్తలు » సోమవారం నుంచి శబరిమల యాత్ర ప్రారంభం (Sabarimala| Ayyappa Swamy| Jyothi Pujas| Makaravilakku| Religion| News)
కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో ఏడాదిలో రెండు నెలల పాటు సాగే శబరిమల యాత్ర సోమవారం ప్రారంభం కానుంది. ఈ యాత్ర కోసం శబరిమలలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
గత ఏడాది ఈ యాత్రలో సుమారు 4.5 కోట్ల మంది భక్తులు పాల్గొనగా ఈ ఏడాది పదిశాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ యాత్రలో పెరిగే భక్తుల రద్దీ దృష్ట్యా ఐదువేల మంది అధికారులు, మూడువేల మంది పోలీసులు ప్రత్యేక విధుల్లో పాల్గొంటున్నారు.
ఇంకా భక్తుల కోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అదనపు బస్సు సర్వీసులను నడుపనున్నాయి. ఈ యాత్రలు ప్రతి ఏడాది నవంబర్‌లో ప్రారంభమై జనవరిలో ముగుస్తాయ. మరోవైపు శబరిమల యాత్రకు వెళ్లే భక్తుల కోసం రైల్వేశాఖ అదనపు సర్వీసులను నడుపనున్నట్లు ప్రకటించింది.
ఇప్పటికే శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మండలం, జ్యోతిపూజలు ప్రారంభమయ్యాయి. ఈ పూజలు జనవరి 14వ తేదీ (మకరజ్యోతి) వరకు కొనసాగుతాయి.