తిరుచానూరులో వెలసిన పద్మావతీ దేవి చదువుల తల్లిగా దర్శనమిచ్చారు. తిరుచానూరులో జరుగుతోన్న కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి చేత వీణ పట్టి చదువుల తల్లి సరస్వతిదేవి అవతారంలో ఇచ్చారు.
శనివారం సాయంత్రం ఊంజల్‌సేవలో భక్తులను కనువిందు చేసిన పద్మావతీ దేవిని వాహన మండపానికి వేంచేపుగా తీసుకెళ్లారు. అనంతరం వజ్రవైఢూర్యాదులతో సరస్వతీ దేవీగా దివ్యసుందరంగా అలంకృతమైన పద్మావతీ దేవిని సవాహనంపై అధిష్టింపజేశారు.
వీణాపాణియై హంసవాహనంపై తిరుమాడవీధుల్లో ఊరేగిన వైనాన్ని వేలాది మంది భక్తులు తిలకించి, భక్తిపారవశ్యంలో మునిగి తేలారు.