హిందూ | క్రైస్తవ | ఇస్లాం | పండుగలు | కథనాలు | వార్తలు | ప్రాంతాలు | ప్రార్థన | దేవీ నవరాత్రి ఉత్సవాలు | వెండివెలుగుల దీపావళి | భగవాన్ శ్రీ సత్యసాయి | శ్రీకృష్ణాష్టమి | వినాయక చవితి | శ్రీరామనవమి
ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » వార్తలు » ముత్యపు పందిరిపై ఊరేగిన అమ్మవారు (Padmavathy| Saraswathi Devi| Tiruchanur| Devotees| Hamsa Vahanam| Muthyapu pandiri)
Feedback Print Bookmark and Share
 
FILE
తిరుచానూరులో జరుగుతోన్న కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. మూడో రోజైన ఆదివారం పద్మావతీ అమ్మవారు ముత్యపు పందిరిపై ఊరేగారు. సర్వాలంకరణాభూషితురాలైన పద్మావతీ దేవి ముత్యపు పందిరిపై మాడవీధుల్లో ఊరేగిన వైనాన్ని వేలాది మంది భక్తులు తిలకించి, భక్తి పారవశ్యంలో మునిగి తేలారు.

ఇదిలా ఉంటే.. రెండో రోజైన శనివారం అమ్మవారు హంసవాహనంపై ఊరేగారు. సరస్వతీదేవీ అవతారంతో వీణాపాణియై సరస్వతీదేవి తిరుమాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు.

మరోవైపు కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుచానూరు అమ్మవారితో పాటు తిరుమల వెంకన్నను దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగిపోతోంది. శ్రీవారి దర్శనార్థం వేచివున్న భక్తులతో పది కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. వెంకన్న దర్శనానికి పది గంటల సమయం పడుతుందని తితిదే వెల్లడించింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.