సత్య సాయిబాబా 84వ జన్మదిన వేడుకలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ప్రారంభం కానున్న ఈ వేడుకల్లో తొలిరోజున వేణుగోపాల స్వామి రథోత్సవం, 19న అంతర్జాతీయ మహిళా దినోత్సవంతో పాటు 20, 21 తేదీల్లో సత్యసాయి సేవాదళ్ దినోత్సవాలను నిర్వహిస్తారు.
అలాగే ఆదివారం (22న) సాయి కుల్వంత్ హాల్‌లో సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ స్నాతకోత్సవం, 23న సత్యసాయి జన్మదినోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రశాంతి నిలయాన్ని సర్వాంగ సుందరంగా అలకరించడం వంటి తదితర ఏర్పాట్లలో సత్యసాయి ట్రస్ట్ వర్గాలు నిమగ్నమయ్యాయి.