తిరుమల-తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో చెన్నై నగరంలో "కళ్యాణమస్తు" కార్యక్రమం వైభవోపేతంగా జరుగనుంది. డిసెంబర్ 11వ తేదీన చెన్నైలో కళ్యాణమస్తు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెన్నై టీటీడీ సమాచార కేంద్ర సలహామండలి అధ్యక్షుడు ఆనందకుమార్ రెడ్డి వెల్లడించారు.
తితిదే ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కళ్యాణమస్తు కార్యక్రమంలో తమిళనాడు రాజధాని చెన్నై నిర్వహించడం ఇదే తొలిసారి. ఇందులో భాగంగా రిజిస్ట్రార్ సమక్షంలో 108 జంటలు ఒకటి కానున్నాయని, అనంతరం అక్కడికక్కడే వారికి ధ్రువీకరణ పత్రాలను కూడా ప్రదానం చేస్తారు. చెన్నైలో జరిగే కళ్యాణమస్తులో ఒకటయ్యే జంటలకు బంగారపు తాళిబొట్టు, మెట్టెలు, వస్త్రాలను టీటీడీ నిర్వాహకులు అందజేస్తారు.
తితిదే ఐదేళ్ల పాటు కళ్యాణమస్తు పేరిట సామూహిక వివాహాల వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల తితిదే ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఐదో విడత కళ్యాణమస్తు ఏకంగా 8, 087 జంటలు ఒక్కటయ్యాయి.