తిరుచానూరు పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే చివరి ఘట్టం పంచమ తీర్థానికి పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. పంచమ తీర్థం మహోత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని తితిదే అంచనా వేస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పుష్కరిణి ప్రాంతాల్లో బారికేడ్లను ఏర్పాటు చేస్తామని తిరుపతి జేఈవో యువరాజ్ తెలిపారు.
పుష్కరిణిలో భక్తులు ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు జేఈవో వెల్లడించారు. అలాగే పద్మసరోవరంలో భక్తులను ఉదయం నుంచి కొద్దిమంది చొప్పున అనుమతిస్తామన్నారు.
మరోవైపు బుధవారం రాత్రి జరుగనున్న గరుడోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. అమ్మవారికి దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతుందని దేవస్థానం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. పెరుగుతున్న భక్తుల దృష్ట్యా వారి సౌకర్యార్థం అన్ని సదుపాయాలను కల్పిస్తున్నామని అధికారులు వెల్లడించారు.