శబరి గీరిశుని దర్శించుటకు వనయాత్ర చేస్తారు భక్తులు. సాక్షాత్ స్వామి అయ్యప్ప నడిచి వెళ్ళిన పూంగావనం, అదె పెరియపాడి - ఎరుమేలి మార్గం. కొట్టాయం నుండి తిరువల్లా మార్గాన 78 కి.మీ. కొట్టాయం నుండి రప్పళ్ళి మార్గము 54 కి.మీ. దూరంలోనూ, కొట్టాయం నుండి మణిమాల మార్గాన 52 కి.మీ. దూరంలోను చెంగనూరు నుండి చెంగచాశ్చేరి మణిమాల మార్గాన 66 కి.మీ దూరంలో చెంగన్నూరు నుండి పత్తనంతిట్ట మార్గాన 63కి.మీ దూరంలోనూ, తిరువనంతపురం నుండి పునలూరు, కొన్ని మార్గాన 176కి.మీ. దూరాన కలదు. ఇక్కడ నుండి భక్తాదులు కాలినడక నడుస్తారు. ఈ మార్గంలో ఎదురయ్యే క్షేత్రాలు : 1 కోట్టెయిప్పడి ఇక్కడే వావరుస్వామి వెలిసినది 2 కాళైకట్ట ప్రాచీన శివాలయం వుంది. 3 ఆళుదానది స్వామి మహిషిని వధించిన స్థలం 4 ఆళుదామేడు 5 కి.మీ ఎత్తయిన గుండ్రాళ్ళతో కూడిన కొండ 5 కల్ ఇడుంకుండ్రు వధించిన మహిషిని పైకి విసిరేయగ కింద పడిన స్థలం 6 ఇంచిప్పారకోట్ల శిధిలమయిన కోట కలదు. ఇక్కడే స్వామి ఉదయనుడు అనే బందిపోటుని హతమార్చారు. 7 కరిమలైతోడు నిటారైన కరిమల శిఖరం ప్రారంభం 8 కరిమలై ఉచ్చి ప్రాచీనమైన దివ్య బావి కలదు 9 వరియాన వట్టం ఇచ్చట ఏనుగులు దప్పిక తీర్చుకుంటాయి 10 శిరియానవట్టం ఇచ్చట భక్తులు వంటలు చేసుకుని విశ్రమిస్తారు. 11 పావన పంబానది అనేక ఔషధమూలికల సారముతో ప్రవహించు పంబానదిని దక్షిణగంగాయని కూడా అంటారు. ఆ శ్రీరామచంద్రుల వారే ఇక్కడ స్నానమాచరించారని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ నుండి భక్తాదులు కాలినడక నడుస్తారు.
ఈ మార్గంలో ఎదురయ్యే క్షేత్రములు : 12 నీలిమల.. ఈ నీలిమల ఎక్కడం చాలా కఠినం. రామాయణంలో దీన్ని మాతంగవనం అంటారు. 13 అప్పాచ్చిమేడు ఇక్కడ నుంచి శబరిపీఠం చేరుకుంటారు. దుర్దేవతల కోసం బియ్యపు ఉండలను విసురుతారు. 14 శబరిపీఠం ఇందులోనే పందళ్ రాజవంశీయులు విద్యాభ్యాసం నేర్చుకొన్నారు. 15 శరంగుత్తి యాత్రలో దీక్షాదండముగా భద్రపరిచి తెచ్చిన శరములను ఇక్కడే వున్న ఠాణి వృక్షములో గుచ్చుతారు. 16 పదినెట్టాంపడి ఇదే ముక్తికి సోపానం. దీనిని అధిరోహించిన వేళ ఎత్తిన ఇరుముడి వుండవలెను. 17 సన్నిధానం
|