రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన నరసింహస్వామి పుణ్యక్షేత్రాల్లో మంగళగిరి కూడా ఒకటి. అహోబిలం, సింహాచలం తదితర దివ్యక్షేత్రాల్లో స్వామి వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నాడు. ఈ మంగళగిరి ఆలయంలో వెలసిన స్వామి పానకాల నరసింహుడిగా పేరు గాంచి భక్తుల కోర్కెలను తీర్చే ఇలవేల్పుగా ప్రసిద్ధికెక్కారు.
విజయవాడకు సమీపంలో ఉన్న మంగళగిరిలో రెండు ఆలయాలు ఉన్నాయి. ఒకటి కొండ కింద ఉండే లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం కాగా, కొండ పైన ఉండేది పానకాలస్వామి వారి ఆలయం. ఈ ఆలయంలో స్వామికి నైవేద్యం పెట్టే పానకంలో సగభాగం ఆయన తాగుతారని ప్రతీతి. కొండరాయిలో ఉండే స్వామి నోట్లో పానకం పోయగా, సగం ఆయన సేవిస్తారని భక్తుల నమ్మకం.
ఇంకో వింతైన విషయం ఏమిటంటే... పానకాలు, చక్కెరలాంటి తీపి పదార్థాలు ఆలయంలో ఉపయోగించినా ఒక్క చీమ కూడా ఇక్కడ ఉండదు. ఈ తరహాలో ఉన్న నరసింహాలయం ఇది ఒక్కటే కావడం గమనార్హం. | | ఆలయంలోని పుష్కరిణిని లక్ష్మీ పుష్కరిణి అని పిలుస్తారు. ఈ పుష్కరిణిని దేవతలు సృష్టించారని పురాణ గాథలు చెబుతున్నాయి. ఇందులో శ్రీమహాలక్ష్మీ స్నానమాడిందని, దేశంలోని పుణ్య నదులు ఇక్కడ కలుస్తాయని భక్తుల నమ్మకం. |
| |
స్థల పురాణం: పూర్వం పరియాత్ర అనే రాజు ఉండేవాడు. అతని కుమారుడు హృస్వశ్రింగి శరీర లోపాలతో జన్మించాడు. తన లోపాలను రూపుమాపుకునేందుకు హృస్వశ్రింగి తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్లాడు. ఈ క్రమంలో మంగళగిరి చేరుకుని తన జీవితాన్ని నరసింహస్వామి సేవకు అర్పించాడు. చివరకు ఓ ఏనుగు ఆకారంలో ఉండే పర్వతంలాగా మారి స్వామివారిని తనపై నివాసం ఉండాలని కోరాడు. భక్తుని కోరిక మేరకు స్వామివారు కొండపై వెలిశాడు.
పూరాణాల్లో ఇంకో కథ కూడా ప్రచారంలో ఉంది. రాక్షసరాజు హిరణ్యకశిపుడిని హతమార్చేందుకు విష్ణుమూర్తి ఉగ్రనరసింహావతారమెత్తి ఇక్కడ వెలిశాడని కూడా భక్తులు అంటుంటారు.
కృతయుగంలో స్వామి వారికి తేనె, ద్వాపర యుగంలో నెయ్యి, త్రేతాయుగంలో పాలు, కలియుగంలో పానకాలను నైవేద్యంగా భక్తులు సమర్పిస్తూ వస్తున్నారు. ఆలయంలోని పుష్కరిణిని లక్ష్మీ పుష్కరిణి అని పిలుస్తారు. ఈ పుష్కరిణిని దేవతలు సృష్టించారని పురాణ గాథలు చెబుతున్నాయి. ఇందులో శ్రీమహాలక్ష్మీ స్నానమాడిందని, దేశంలోని పుణ్య నదులు ఇక్కడ కలుస్తాయని భక్తుల నమ్మకం.
|