భక్తికి మారుపేరు ఆంజనేయుడు. ఆంజనేయుని స్తుతించే సమయంలో కూడా "రామభక్తా"! అనే కీర్తిస్తాం. అంజనీ పుత్రునికి రాముడిపై ఉన్న భక్తిని మనం మాటల్లో చెప్పలేం!
అంజనీ పుత్రుడు ఆంజనేయుడు ఓ సారి ఆకాశంలో వెళ్తున్న సమయంలో, ఓ చోట గుంపుగా ప్రజలు నిల్చుని పాటలు పాడుతున్నారు. అది చూసిన ఆంజనేయుడు వారికి దగ్గరగా వెళ్లి చూశాడట. ఇంకేముంది తన ఇష్టదైవమైన రాముడ్ని స్తుతిస్తూ అక్కడి భక్తులు పాటలు పాడుతూ, నాట్యాలు చేస్తున్నారట.
హనుమంతుడు పరవశంతో తనను తానే మర్చిపోయి నాట్యం చేశాడట. రాముడి భజన వినిపిస్తే చాలు ఆంజనేయుడు అన్నీ మర్చిపోతాడు. కనుక, ఆ ప్రాంతంలోనే ఆంజనేయుడికి ఆలయం కట్టి భక్తులు పూజిస్తున్నారు.
ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం సమీపంలో ఓ చిన్నగ్రామంలో ఉంది. ఈ ఆలయం పేరు ఆడుదురై ఆలయం. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుంటుంటారు.
|