ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > ప్రాంతాలు > పట్టిసీమలో వెలసిన వీరభద్రస్వామి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పట్టిసీమలో వెలసిన వీరభద్రస్వామి
పట్టిసీమలో వెలసిన వీరభద్రస్వామి ఆలయం పంచకాశీ క్షేత్రాలలో ఒకటిగా పేరుగాంచింది. పశ్చిమ గోదావరి జిల్లా, పోలవరం మండలానికి చెందిన ఈ గ్రామం రాజమండ్రికి 40 కి.మీ దూరంలో, ఏలూరుకు 120 కి.మీ దూరంలో ఉంది. కోస్తాతీర అందాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది పట్టిసీమ ప్రాంతం.

ఈ ప్రాంతం గోదావరి మధ్యలో ఏర్పడిన ఓ దీవి. ఇది ఓ గ్రామంగా
పట్టిసీమ అందాలు
  పట్టిసీమ గోదావరి మధ్యలో ఏర్పడిన ఓ దీవి. ఇది ఓ గ్రామంగా కన్నా ప్రసిద్ధి గాంచిన శైవక్షేత్రంగా చరిత్రకెక్కింది. పాపికొండల మధ్య పారే గోదావరి ఒడ్డున దేవకూట పర్వతంపై వీరభద్రస్వామి ఆలయం, భావనారాయణ స్వామి వారి ఆలయాలు నిర్మించబడి ఉన్నాయి.      
న్నా ప్రసిద్ధి గాంచిన శైవక్షేత్రంగా చరిత్రకెక్కింది. పాపికొండల మధ్య పారే గోదావరి ఒడ్డున దేవకూట పర్వతంపై వీరభద్రస్వామి ఆలయం, భావనారాయణ స్వామి వారి ఆలయాలు నిర్మించబడి ఉన్నాయి. ఇక్కడ ఈ దేవాలయాలే కాదు, ఇంకా చాలా ఆలయాలు కూడా ఉన్నాయి.

ఈ ఆలయంలోని పరమశివుడికి అభిముఖంగా అద్భుతమైన నంది విగ్రహం ఉంటుంది. ఆలయంలోని గోడలు వివిధ రకాల నృత్యాల చిత్రపటాలతో అలంకరించి ఉంటుంది. గౌతమ బుద్ధుడు ఈ ప్రాంతానికి వచ్చి ధ్యానం చేశాడని చరిత్ర చెబుతోంది. శివరాత్రి ఉత్సవాలు ఇక్కడ చాలా వైభవంగా నిర్వహిస్తారు.

స్థలపురాణం:
పూర్వం పర్వతాలకు రెక్కలు ఉండేవట. అలా ఆకాశంలో ఎగురుతూ, సేద తీరేందుకు ఓ చోట ఆగేవట. సేదదీరేందుకు అవి భూమిపై దిగే సమయంలో అక్కడ ఉన్న జనజీవనం మొత్తం నాశనమయిపోయేది. ఈ విషయాన్ని తెలుసుకున్న దేవేంద్రుడు ఆ పర్వతాల రెక్కలను ఖండించాడు. దీంతో ఆ పర్వతాలు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ పర్వతాలనే దేవ కూటాద్రి పర్వతాలు లేక నీలాద్రి పర్వతాలు అని పిలుస్తుంటారు.

దేవకూటాద్రి పర్వతం పర్వత రాజైన కరవీర కుమారుడు. కాగా, ఈ కరవీరుడు కైలాసనాథుని కోసం కఠినంగా తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన శివుడితో లింగాకారంలో తనపై నివాసం ఉండాలని వరం కోరుకున్నాడు. భక్తుని కోరిక మేరకు శివుడు కొండపై నివాసముండేందుకు అంగీకరించాడు. కొంత కాలం గడిచిన తర్వాత, శివుని భార్య సతీదేవి తండ్రి దక్షప్రజాపతి తలపెట్టిన యాగానికి అందరు దేవతలు హాజరయ్యారు. పరమశివుడు, అతని భార్యను మాత్రం పిలువలేదు. ఈ అవమానాన్ని సహించలేని సతీదేవి తండ్రిని నిలదీసేందుకు యాగశాలకు వెళ్లింది.

అక్కడ తండ్రి శివుని గురించి దుర్భాషలాడటంతో సతీదేవి అవమాన భారాన్ని మోయలేక అగ్నికి ఆహుతయింది. దీంతో కోపోద్రిక్తుడైన పరమశివుడు తన తలలోని జటాజూటంలోంచి వీరభద్రుడిని పుట్టించాడు. వీరభద్రుడు దక్షుని సంహరించి ఉగ్రరూపంతో తాండవమాడుతున్న సమయంలో దేవతలు శాంతింపజేసి, దేవకూటాద్రి పర్వతంపై నివాసముండాలని కోరారు. తద్వారా ఈ ప్రాంతంలో వీరభద్ర స్వామి వెలిశాడు. అప్పట్నుంచీ, ఈ ప్రాంతం చక్కని పర్యాటక ప్రాంతంగానే కాకుండా, ఆధ్యాత్మిక ప్రాంతంగా కూడా విరాజిల్లుతోంది.
మరిన్ని
రాక్షసవధతో ముక్కంటిగా మారిన హనుమాన్
భక్తి పారవశ్యంలో నాట్యమాడిన ఆంజనేయుడు
మంగళగిరిపై వెలసిన పానకాల నరసింహస్వామి
అయ్యప్ప సేవా సంఘం
శ్రీ అయ్యప్ప వారి దివ్య చరితము
శబరిమలై వనయాత్రలో ఎదురయ్యే క్షేత్రములు