వినాయకుడు సాధారణంగా తొండంతో ఓ కాలిని మడిచి కూర్చుని అభయమివ్వడమే మనం చూసుంటాం. అయితే కొన్ని ప్రాంతాల్లో వినాయకుడు, చిన్నపిల్లవాడిలా పాకుతూ, భక్తుల చేత లేఖలు రాయించుకుంటూ... ఇలా పలు రూపాల్లో దర్శనమిస్తుంటాడు.
| | శ్రీకాళహస్తిలోని కాళహస్తీశ్వర ఆలయంలో వినాయకుడు పాతాళ వినాయకుడిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. పాతాళంలో వెలసినందున ఈయనకు ఆ పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. అంతే కాదు, ప్రక్కనే స్వర్ణముఖి నది ప్రవహిస్తుండటంతో ఆ ఆలయం చాలా మంగళకరంగా ఉంటుంది.
|
| |
శ్రీకాళహస్తిలోని కాళహస్తీశ్వర ఆలయంలో వినాయకుడు పాతాళ వినాయకుడిగా భక్తులకు దర్శనమిస్తాడు. పాతాళంలో వెలసినందున ఈయనకు ఆ పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. అంతే కాదు, ప్రక్కనే స్వర్ణముఖి నది ప్రవహిస్తుండటంతో ఆ ఆలయం చాలా మంగళకరంగా ఉంటుంది.
అలాగే తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లాలోని జలకంఠేశ్వరాలయంలో వెలసిన గణపతి పాకుతూ దర్శనమిస్తాడు కనుక, ఆయనకు బాల గణపతి అనే పేరు వచ్చింది. అలాగే తమిళనాడులో ఆలయాలకు ప్రసిద్ధి గాంచిన ఊరు కుంభకోణంలోని తారాశురమ్ అనే ప్రాంతంలో ఉన్న ఏకదంతుడిని మొండి వినాయకుడిగా పిలుస్తారు. పిల్లలు మొండిగా ఉంటే ఇక్కడకు వచ్చి స్వామివారికి మొక్కుకుని గరిక మాల, ఉండ్రాళ్లను సమర్పించుకుంటారు.
ఇలా చేయడం ద్వారా వారు మొండితనం విడిచిపెట్టి, బుద్ధిమంతులుగా మారతారని వారి నమ్మకం. ఇంకో విషయం ఏమిటంటే రాజస్థాన్‌లో భక్తులు వినాయకుడికి ఏకంగా లేఖలే రాస్తారట. రాజస్థాన్‌లోని మోదిదుంగరి అనే ప్రాంతంలో వెలసిన ఈ వినాయకుడి పాదాల వద్దే భక్తులు తమ లేఖలను సమర్పించుకుంటారట.
|