ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > ప్రాంతాలు > లక్ష్మీనరసింహస్వామి వెలసిన యాదగిరిగుట్ట
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
లక్ష్మీనరసింహస్వామి వెలసిన యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట... ఈ ప్రాంతం రాష్ట్ర రాజధానిలో నివసించే వారికి సుపరిచితమే. హైదరాబాద్‌కు 60 కి.మీ దూరంలో సికింద్రాబాద్- కాజీపేట్ మార్గంలో భోన్‌గిర్ సమీపంలో ఉన్న కొండప్రాంతం. యాదగిరిగుట్ట అని పిలువబడే 300 అడుగుల ఎత్తున్నఈ గుట్టపై (కొండ)పై లక్ష్మీ సమేత నరసింహస్వామి కొలువు దీరారు.

ఆ ఆలయంలో జ్వాలా నరసింహ, గండబేరుండ నరసింహ, యోగ నరసింహలను భక్తులు పూజిస్తారు. అంతేకాదు, ఈ ఆలయంలో లక్ష్మీనరసింహుని వెండి విగ్రహాలు దర్శమిస్తాయి. ఈ ఆలయ ద్వారం వద్ద హనుమంతుడి ఆలయం ఉంది. ఈ ఆలయ మధ్యలో ఖాళీ స్థలం ఉంటుంది. దీనినే గండబేరుండ నరసింహ అని అంటారు. అంతేకాదు, గుట్ట(కొండ)పై ఓ శివాలయం కూడా ఉంది.

స్థలపురాణం:
పూర్వం రష్యసృంగుని కుమారుడు యాదవుడు విష్ణు మూర్తిని మూడు అవతారాలలో చూడాలని ఘోర తపస్సు చేశాడట. ఈ కోరికను మన్నించిన విష్ణుమూర్తి ఆ గుట్టపై వెలిశాడు. అప్పటినుంచి ఈ కొండకు యాదగిరికొండ అనే పేరు వచ్చింది.

ఈ ప్రాంతంలో ఋషులు తపస్సు చేస్తారు కనుక, దీనికి ఋషి ఆరాధనా క్షేత్రంగా పేరు వచ్చింది. హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత ఉగ్రనరసింహుడు ప్రహ్లాదునికి దర్శనమిచ్చారనేందుకు సాక్ష్యంగా ఇక్కడ ఓ గుహ ఉంది.

దెయ్యాలు పట్టినవారు, దుష్టశక్తులచే ప్రభావితం అయినవారు, చేతబడులు జరిగినవారు ఇక్కడకు అధికంగా వస్తారు. ఈ స్వామి వారికి స్వప్నంలో కనిపించి వారి వ్యాధులను నయం చేసినట్టు చాలా సందర్భాలు చెబుతున్నాయి. రాజధానిలో ఉన్న ఆధ్యాత్మిక ప్రాంతాల్లో ఇది అతి ముఖ్యమైనది. లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాల్లో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం.
మరిన్ని
వివిధ రూపాల్లో దర్శనమిచ్చే ఏకదంతుడు
పట్టిసీమలో వెలసిన వీరభద్రస్వామి
రాక్షసవధతో ముక్కంటిగా మారిన హనుమాన్
భక్తి పారవశ్యంలో నాట్యమాడిన ఆంజనేయుడు
మంగళగిరిపై వెలసిన పానకాల నరసింహస్వామి
అయ్యప్ప సేవా సంఘం