రాష్ట్రంలోని అతిపురాతన పుణ్యదేవాలయమైన శ్రీ శ్రీ శ్రీ మందేశ్వర (శనేశ్వర) స్వామిని దర్శించుకోవడం మంచిదని పురాణాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా.. శనీశ్వరునికి ప్రీతికరమైన "శనిత్రయోదశి" పర్వదినాన మందేశ్వరునికి విశేష పూజలు గావించిన వారికి శనిగ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు.మీ ఈతిబాధలు, సమస్త దోషములు తొలగిపోవాలంటే... "శనిత్రయోదశి" రోజున మందేశ్వర స్వామిని దర్శించుకుని ఏకాదశి రుద్రాభిషేకం, తైలాభిషేకం చేయించండి.మందేశ్వర ఆలయానికి ఎలా వెళ్లాలంటే...పురాణ ప్రసిద్ధి గాంచిన ఈ దివ్యక్షేత్రానికి తూర్పుగోదావరి జిల్లా "రాజమండ్రి" నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సుల ద్వారా "రావులపాలెం" చేరుకోవాలి. రావులపాలెం నుంచి మందేశ్వర స్వామి వారి ఆలయం సుమారు 9 కిలోమీటర్లు దూరంలో ఉంది. రమణీయమైన కోనసీమ ప్రాంతం "మందపల్లి" గ్రామంలో ఈ పుణ్యక్షేత్రం వెలసి ఉంది. |