ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > ప్రాంతాలు > సర్వ సౌభాగ్యాల పుట్టినిల్లు కంచీక్షేత్రం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సర్వ సౌభాగ్యాల పుట్టినిల్లు కంచీక్షేత్రం
FileFILE
కాంచీక్షేత్రం భారతదేశంలోని సప్తమోక్షపురులలో ఒకటి. అది సర్వసౌభాగ్యాలకు పుట్టినిల్లు. మోక్ష విద్యకు మూలపీఠం. అద్వైత విద్యకు ఆధార భూమి... ఆదిశంకరులు అధిష్టించిన కామకోటి పీఠ వైభవంతో ఈ క్షేత్రం శోభ, ప్రశస్తి మరింత దేదీప్యమానం అయ్యాయి. ఆదిశంకరుల నుంచి నేటివరకూ అవిచ్ఛిన్నంగా ఆ కామకోటి పీఠ జగద్గురు పరంపరను సాక్షాత్కరింపచేస్తున్న గురు పీఠానికి ఇది ఆవాసభూమి.

శైవ, శక్తి, వైష్ణవ క్షేత్రమే గాక, సత్యజ్ఞానానంద గురువగు షణ్ముఖ స్వామికి కూడా ఇది నివాస ప్రదేశం. మొత్తం భారత భూమికిది నాభిస్థానం. అతి ప్రధానమైన శక్తి క్షేత్రం ఈ కంచీక్షేత్రం.

భారతదేశం అంత పుణ్యభూమియే అయినప్పటికీ అందులోని ఏడు క్షేత్రాలు మోక్షపురులుగా పేర్కొనబడుతున్నాయి.

శ్లో|| అయోధ్య మధురా మాయా
కాశీ కాంచీ అవంతికాపురీ
ద్వారవతీ చైవ సప్తతే
మోక్షదాయకా||

ఇందులో కాశీ, అవంతిక (ఉజ్జయిని) శివక్షేత్రాలు. అయోధ్య, మధుర, పూరి క్షేత్రాలు విష్ణు క్షేత్రాలు. మాయా (హరిద్వారం) క్షేత్రం శక్తి క్షేత్రం. కానీ కాంచీపురం శివ, విష్ణు, షణ్ముఖ క్షేత్రం ఇదే నేటి కాంచీక్షేత్ర ప్రత్యేకత. ఇవి దక్షిణ భారతావని కంతటికీ ఏకైక మోక్షపురిగా వున్నది.

కాంచీ అంటే ఏమిటి?

ఆది నుంచి మహా తమస్సులకు కన్నతల్లి అయిన భారతదేశం ఒక దివ్యాంగన... ఆమెకు నాభిస్థానమైనది కంచి.. అనగా ఆమెకు ఇది కాంచీగా (మొలనూలు లేక వడ్డాణం) అయివున్నది కనుక దీనికి ఈ పేరు కలిగింది.

తంత్ర పరిభాషలో ఓఢ్యాణం (ఒడ్దాణం) అనే పేరుతో కూడా ఈ నగరం పిలువబడుతున్నది. పరమ శివాంశవతారులు - అద్వైత సిద్ధులు అయిన ఆదిశంకరులు యావద్భారతంలోనూ అద్వైత సిద్ధాంతాన్ని, వైదిక ధర్మాన్ని సుప్రతిష్టిం చేసి, తను మాతృభూమికి నాభిస్థానంలో వుండి మోక్షపురిగానూ, మహాశక్తి పీఠంగానూ విశేష మహిమాన్వితమైన కంచికి విజయం చేశారు.

ఇక్కడ కామకోటి పీఠానికి తాము అధిపతులై తమ దివ్యావతారంలో తుదిదైన పరిశిష్ట విభూతిని ఇక్కడనే విరాజిల్ల చేశారు. తాము కైలాసం నుండి తెచ్చిన పంచ స్ఫటిక లింగాలలో ఒకటైన యోగలింగాన్ని శ్రీ మేరువులను అర్పించుకుంటూ కామకోటి పీఠాన్ని శిష్య పరంపరతో ప్రవర్తిల్లేలా చేశారు.

శ్లో|| కాంచీపురం సమాలోక్య
ననంద కమలాముడుః
అధి భౌతిక మంహోఘ్నం
నాభిస్థానం భువః పరం||

అనాది సిద్ధమైన కంచికామకోటి పీఠం భాగవతాదులకు శ్రీ ఆదిశంకరులకు పరమపూజ్యమైంది. దక్షిణమ్నాయ శక్తి అయిన కామకోటి కామాక్షీ దేవి నామంతోనే కామకోటి పీఠం ఏర్పాటైంది. ఆదిశంకరులు కామకోటి పీఠానికి ప్రధమాచార్యులు. కామాక్షీ దేవి సన్నిధిలోనే వారు సర్వజ్ఞ పీఠాధిరోహణం చేశారు. అవిచ్ఛిమైన శిష్య పరంపరతో ఈ పీఠం అద్వైత బ్రహ్మవిద్యలో ఆలంబనగా వుండాలన్నదే ఆదిశంకరుల అభిమతం.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
నరసింహస్వామిని దర్శించుకోండి
"శనిత్రయోదశి" నాడు మందేశ్వరుని దర్శించుకోండి
అరుణాచలేశ్వర క్షేత్రానికి ఎలా వెళ్లాలి..?
అమరేశ్వర స్వామిని దర్శించుకోండి
ద్రాక్షారామాన్ని దర్శించుకోండి.
రాజధాని పాలరాతి మందిరం బిర్లా మందిరం