హిందూ | క్రైస్తవ | ఇస్లాం | పండుగలు | కథనాలు | వార్తలు | ప్రాంతాలు | ప్రార్థన | దేవీ నవరాత్రి ఉత్సవాలు | వెండివెలుగుల దీపావళి | భగవాన్ శ్రీ సత్యసాయి | శ్రీకృష్ణాష్టమి | వినాయక చవితి | శ్రీరామనవమి
ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » ప్రాంతాలు » సత్యన్వేషణకు రహదారి అరబిందో ఆశ్రమం (Arabindo Asramam | Chennai | Puducheri | Religion | God |)
 
File
FILE
ప్రపంచాన్ని సత్యమార్గంలో నడిపించేందుకు యోగ సాధనలో చరిత్ర సృష్టించిన భగవాన్ శ్రీ అరవింద శ్రీ అన్నై పవిత్ర సమాధి తమిళనాడులోని పుదుచ్చేరిలో వెలసి ఉండటం ఎంతో భాగ్యమని ఆధ్యాత్మిక పెద్దలంటూ ఉంటున్నారు.

ఆధ్యాత్మికమార్గంలో ప్రపంచంలోని అన్ని వర్గాల ప్రజలను ఒకే త్రాటిపై నడిపించే తరహాలో ఎన్నో శుభకార్యాలు శ్రీ అరవిందర్, అన్నై ఆశీస్సులతో జరిగాయనడంలో ఎలాంటి సంశయం లేదు. పుదుచ్చేరికి వెళ్లి వస్తే.. మలుపులు కలుగుతాయని ఆధ్యాత్మిక గురువులు అంటుంటారు.

అలాగే శ్రీ అన్నై మాతను స్మరించుకుని ఎలాంటి కార్యాన్నైనా ప్రారంభించేవారికి ఆటంకాలుండవని భక్తుల విశ్వాసం. అలాగే జీవిత సుఖసంతోషాలు కలుగజేసే ఆ దేవదేవుని లీలలెన్నో ఉన్నాయని పుదుచ్చేరి అన్నై అరబిందో ఆశ్రమ స్థల పురాణాలు చెబుతున్నాయి.

భగవానుని లక్ష్యాన్ని మానవరూపం ధరించి (అరబిందోగా) పరమాత్ముని లక్ష్యాన్ని నెరవేర్చేందుకు జన్మించి, పుదుచ్చేరి ఆశ్రమంలో జీవించారని ఆధ్యాత్మిక గురువులు అంటున్నారు.

ప్రపంచ అభివృద్ధి కోసం అరబిందో స్వామి సేవలందించిన సంస్థల్లో పుదుచ్చేరి అరబిందో ఆశ్రమం కీలక పాత్ర పోషిస్తోంది. అంతేగాకుండా అరవింద భగవానుడు రాసిన లైఫ్‌డివైన్, సింథసిస్ ఆఫ్ యోగా, సావిత్రి అన్నై రాసిన మధర్ అజెండాలతో పాటు పలు ఆధ్మాత్మిక రచనలు మానవమాత్రుని జీవితానికి ఎంతగానో సహకరిస్తున్నాయి. అలాగే మానవాభివృద్ధికి అవసరమైన దైవ, ఆధ్యాత్మిక సూచనలు అందిస్తున్నాయి.

అటువంటి మహనీయుని ఆధ్యాత్మిక మార్గములో మానవుడు పయనించేందుకు వీలుగా అరబిందో మహాత్ముని ఉపదేశాలు, ఆధ్యాత్మిక సూచనలు దేశంలోనే గాకుండా.. ప్రపంచవ్యాప్తంగా గల ప్రజలకు మార్గదర్శకం చేసిన శ్రీ అన్నై అరవిందో అన్నై ఆశీస్సులను పొందేందుకు వీలుగా చెన్నై నగరంలోని శ్రీ అరబిందో మదర్స్ సొసైటి తరపున చెన్నై వెస్ట్ మాంబళం, నంగనల్లూరు, అంబత్తూరు అనే మూడు ప్రాంతాల్లో భక్తులకు ఆధ్యాత్మిక సూచనలు అందిస్తోంది.

పుదుచ్చేరిలోని ఆశ్రమ వాతావరణం తరహాలో చెన్నై నగరంలో వందలాది మంది భక్తులు వచ్చి వెళ్లేందుకు వీలుగా, దీంతో పాటు ప్రపంచంలోని ఆధ్యాత్మిక ప్రియుల రాకపోకలకు సత్యజీవియ కేంద్రం ఏర్పాటైంది.

ఈ కేంద్రంలో భగవాన్, అన్నై పవిత్ర శక్తితో కూడిన వస్తువులతో సమాధిని ఏర్పాటు చేయడం, భగవాన్ అన్నై అరబిందో అన్నైల నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, ధ్యానమందిరాలను ఏర్పాటు చేయనున్నారు.

శ్రీ అన్నై లక్ష్య సాధనల కోసం ఏర్పాటయ్యే ఈ కేంద్రం ఏర్పాటులో మీరు కూడా పాలుపంచుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులు , సమస్యల నుంచి పరిష్కారం పొందేందుకు తగిన సూచనల కోసం శ్రీ అన్నై అడిగళార్‌ను సంప్రదించి, తమ సమస్యలను తెలుపుకోవచ్చు. పూర్తి వివరాల కోసం శ్రీఅన్నైఅడిగళ్@జిమెయిల్.కామ్ అనే మెయిల్‌ లేదా 98414 25456 అనే మొబైల్ నంబరులో వివరాలు తెలుసుకోవచ్చు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.