ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > భగవాన్ శ్రీ సత్యసాయి > బాబా జన్మదిన వేడుకలకు రంగం సిద్ధం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
బాబా జన్మదిన వేడుకలకు రంగం సిద్ధం
FILE
అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఆదివారం సత్యసాయి బాబా జన్మదిన వేడుకలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. బాబా జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లాపోలీసు అధికారులు మూడురోజులు ముందుగానే పుట్టపర్తికి చేరుకుని, భద్రత ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు.

జిల్లాల్లోని సీఐలు, ఎస్ఐలతో పాటు చిత్తూరు, కర్నాలు, కడప జిల్లాల నుంచి కూడా పోలీసు సిబ్బంది అనంతపురం చేరుకుంది. బాబా జన్మదిన వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న నేపథ్యంలో... ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందుజాగ్రత్తగా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసింది. వేడుకలను పురస్కరించుకుని సాయికుల్వంత్ హాల్‌ను అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
సత్యసాయి జన్మదిన వేడుకలు ప్రారంభం
పుట్టపర్తిలో వైభవంగా ముగిసిన విశ్వశాంతి యాగం
సత్యసాయిని సైతం వదలని ప్రశంసలు... విమర్శలూ..!
సత్యసాయి ఆశ్రమాలు, మందిరాలు
సత్యసాయి మహిమలు
భగవాన్ సత్యసాయి సూక్తులు