సత్యసాయి తన వద్దకు వచ్చిన భక్తులతో ఇలా అంటారు. "నేను దేవుడిని. నీవు కూడా దేవుడివే. తేడా ఏమిటంటే ఈ సంగతి నాకు తెలుసు. నీకు అసలు తెలియదు. మీ హృదయాలలో ప్రేమ అనే దీపం వెలిగించి దానిని అనుదినం ప్రజ్వలింపజేయడానికే నేను వచ్చాను. నేను ఏదో ఒక మతం తరపున గాని ఒక సంఘం తరపున గాని ప్రచారానికి రాలేదు. ఒక సిద్ధాంతానికి అనుయాయులను ప్రోగుచేయడానికి రాలేదు.
పరమ పావనమైన భారతదేశానికి ఎలాంటి ప్రమాదం లేదని, సత్యం, ధర్మం రెండింటిని ప్రేమ, శాంతి వెన్నంటి ఉంటాయని సత్యసాయి బాబు పేర్కొన్నారు. సమస్త లోకాలు సుఖంగా ఉండాలని సత్యసాయి బాబా ఈ సందర్భంగా దీవించారు. రాబోయే 28 ఏళ్లలో ప్రపంచంలో...