ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » సంక్రాంతి (Sankranti)
రంగుల హరివిల్లుముత్యాల ముగ్గులురత్నాల గొబ్బెమ్మలుచెరుకు గడలుమసాలా వడలుపతంగుల రెపరెపలుగంగిరెద్దుల గలగలలుతంబుర నాదాలుధాన్యపు రాశుల లోగిళ్లుమీ వాకిళ్లు...నిత్యం ఆ సంక్రాంతి లక్ష్మివీక్ష మీపై ఉండాలని కోరుకుంటూ....మీ వెబ్‌దునియా తెలుగుఎడిటర్
  ఇంకా చదవండి
 
ఉత్తరాయణ పుణ్యదినమైన మకర సంక్రాంతి అంటేనే డూడూ బసవన్నలు, హరిదాసుల పాటలు మనకందరికీ గుర్తుకు వచ్చేస్తుంటాయి. అయితే మకర సంక్రాంతి అనేది సౌర కుటుంబంలో సూర్యుడు మనిషిని ప్రభావితం చేసే ఒక ప్రధానమైన అంశమేని, అందుకే సూర్యునికి సంబంధించిన ఈ పండుగను ప్రజలు ఎంతో విశేషంగా జరుపుకుంటారు.
 
మకర సంక్రాంతి పుణ్యదినాన దానధర్మాలు చేయడం ద్వారా జన్మజన్మల దారిద్ర్య బాధలు తొలగిపోతాయని విశ్వాసం. సంక్రాంతి రోజున స్త్రీలు పువ్వులు, పసుపు, కుంకుమ, పండ్లను దానం చేయడం ద్వారా సకలసంపదలతో పాటు దీర్ఘసుమంగళీ ప్రాప్తం లభిస్తాయి. సంక్రాంతి ఒంటరిగా రాదని పెద్దలంటూ ఉంటారు.