| ఇంకా చదవండి |
| ఒకానొకప్పుడు భారత సాంప్రదాయంలో, ఈ భూమిపై ప్రతీరోజును ఒక పండుగగా జరుపుకునేవారు. ఆ లెక్కన 365 రోజులూ పండు దినాలే! జీవితాన్ని ఒక వేడుకగా జరుపుకోవడమే దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం! అలా ఏదో ఒక దారిన పోతూనో లేదా కార్యాలయాలకి వెళ్ళేటప్పుడో వేడుకలు చేసుకోలేం కదా? అందుకే ఈ పండగలొచ్చాయి. | మన భారతీయ సంస్కృతికి అద్దం పట్టే విధంగా అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో 'దీపావళి' ఒకటి. దీనిని రెండు రోజుల పండుగగా జరుపుకుంటూ ఉంటారు. ఆశ్వీయుజ మాస బహుళ చతుర్థశి నరక చదుర్థశిగాను, అమావాస్యను దీపావళి పుణ్యదినంగా భావించి ఆరోజు శ్రీ మహాలక్ష్మీపూజ జరిపి, రాక్షసుల బాధలు తొలగిన ఆనందాన్ని వ్యక్తపరచుటకై దీపాలంకరణలు చేసి బాణాసంచా కాలుస్తారు. |