సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పాలపొడితో చాక్లెట్స్
FileND
కావలసిన పదార్థాలు :
పాలపొడి... అరకప్పు
కండెన్స్‌డ్ మిల్క్... రెండు టీస్పూన్లు
ఐసింగ్ షుగర్, కోకోపొడి, తాజా వెన్న... ఒక్కో స్పూన్ చొప్పున
అంజూర్ తరుగు... ఒక పెద్ద టీస్పూన్ (బేకరీల్లో లభిస్తాయి)
బాదంపప్పులు... గుప్పెడ

తయారీ విధానం :
ఓ వెడల్పాటి గాజు బౌల్ తీసుకుని అందులో పాలపొడి, కోకోపౌడర్, వెన్న, ఐసింగ్ షుగర్ అన్నీవేసి పాలుపోసి, గట్టిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమానికి అంజూర్ తరుగును చేర్చాలి. వెడల్పాటి గాజు ట్రే ఒక దాన్ని తీసుకుని కాస్త వెన్నరాసి, అందులో ఈ మిశ్రమాన్ని సమంగా సర్దాలి.

గట్టిగా కేక్‌లా ఉండే ఈ మిశ్రమాన్ని చక్కని షేపులో ముందుగానే సన్నని కత్తితో కోసుకుని... వాటిపై బాదం పప్పులను అలంకరించండి. ఇప్పుడీ ట్రేను డీప్‌ఫ్రీజర్‌లో పెట్టేయండి. సరిగ్గా పావుగంట తర్వాత తీసి… దానికి వెనీలా ఐస్‌క్రీమును జోడించి వడ్డించేయండి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
హనీడేట్‌
నువ్వుల నూనెలో- లక్ష్మీదేవీ, నీటి వనరులలో- గంగాదేవీ
మహిళల సౌభాగ్యానికి ప్రతీక దీప ప్రజ్వలన
"సత్యభామ" నరకాసురుని వధించుట
మండుతున్న బాణాసంచా ధరలు  
దీపావళి రోజున మహాలక్ష్మీ పూజా వైశిష్ట్యం