ఈ భస్మ హారతి సమయంలో భక్తులు గర్భ గుడిలోకి సాధారణ దుస్తులతో పోకూడదు. ఈ పూజా సమయంలో పురుషులు పట్టు ధోవతీలు, మహిళలు చీరలతో మాత్రమే అనుమతించబడతారు. ప్రధాన హారతి కార్యక్రమంలో పురుషులకు మాత్రమే ప్రవేశముంది. ఈ సమయంలో మహిళలు గర్భగుడిలోకి అనుమతించబడరు. భక్తులు ఈ భస్మ హారతి కార్యక్రమాన్ని గర్భగుడి వెలుపల ఉన్న నంది మందిరంలోంచి చూసి తరిస్తారు.
శివరాత్రి, శ్రావణ సోమవారం పర్వదినాలలో లక్షలాది మంది భక్తులు భక్తి ప్రపత్తులతో, కోరికలతో మహాకాల్ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. హిందూ సంవత్సరంలో అయిదవ నెల అయిన శ్రావణ మాసంలో ప్రతి సోమవారం మహాకాలుడు తన ప్రజల స్థితిగతులను చూసేందుకు ఉజ్జయినిని సందర్శిస్తాడు. ఆ రోజున, మహాకాలుడి ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఉంచి పురవీధుల్లో ఊరేగిస్తారు. మహాకాలుడి రధాన్ని శ్రావణ మాసం చివరి సోమవారం పురవీధుల్లో ఊరేగిస్తారు. ఈ ఉత్సవానికి అశేష ప్రజానీకం తరలి వస్తారు. భక్తుల నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగుతుంది.
మహాకాల్ ఆలయ ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పురాణాల ప్రకారం
ఉజ్జయినికి ఒకే ఒక రాజు ఉండేవాడు. ఆయన పేరే మహాకాల్. ఉజ్జయిని శివారు ప్రాంతాల్లో రాజు, చక్రవర్తులు నివశించే వారు కాదు. ఎప్పుడైతే ఉజ్జయిని సింధియాల పాలనలోకి వచ్చిందో.. వారు పట్టణ శివారు ప్రాంతాల్లో కలియాద ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు.
హారతి సమయాలు ఈ మహాకాల్ ఆలయంలో తెల్లవారుజామున నాలుగు గంటలకు హారతి ఇస్తారు. ఆ సమయంలో ఆలయ ప్రధాన ద్వారాలను మూసి వేస్తారు. దీన్నే 'భస్మ హారతి' అని అంటారు. ఇది ఉదయం ఆరు గంటల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత ఉదయం 7.30 గంటల నుంచి 8.15 గం వరకు 'నైవేద్య హారతి' అంటారు. సాయంత్రం ఐదు గంటలకు 'జలాభిషేకం' పూర్తవుతుంది. సాయంత్రం 6.30 గంటల నుంచి 7 గంటల సమయాన్ని 'సంధ్యా హారతి' కాలంగా పేర్కొంటారు. రాత్రి 10.30 గంటల ప్రాంతాన్ని 'షయాన్ హారతి'గా పిలుస్తారు. ఆలయ ద్వారాలను రాత్రి 11 గంటలకు మూసివేస్తారు. అయితే.. వేసవి కాలంలో ఉదయం 7 గం నుంచి 7.45 గంటల ప్రాంతాన్ని 'నైవేద్య హారతి' కాలంగాను, సాయంత్రం 7 గం నుంచి 7.30 గంటల వరకు 'సంధ్యా హారతి' కాలంగాను పేర్కొంటారు.
|