మీరు అక్కడకు ఎపుడు వెళ్లాలి? ఈ ఆలయం సంవత్సరం పొడవునా భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. అయితే.. ప్రతి శివరాత్రి పర్వదినంతో పాటు.. శ్రావణ మాసంలో ఈ ఆలయం అశేష భక్తజనంతో కళకళలాడుతుంది. ఇక్కడకు వచ్చే భక్తులు కాళ్ళకు పాదరక్షలను ధరించకుండా.. కావారియాను ధరించి భక్తి ప్రవత్తులతో కనిపిస్తారు. శ్రావణ మాసంలో 'శ్రావణ్ మహోత్స'వాన్ని కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
ఈ ఆలయానికి ఎలా వెళ్లాలి?
రోడ్డు మార్గం ద్వారా... ఉజ్జయిని-అగ్రా-కోట్-జైపూర్ మీదుగా. ఉజ్జయిని-భాద్వానగర్-రాట్లం-చిత్తూర్ మార్గం. ఉజ్జయిని-మాక్సి-షాహజ్నాపూర్-గ్వాలియర్-ఢిల్లీ మార్గం. ఉజ్జయిని-దేవాస్-భోపాల్ మార్గం. ఉజ్జయిని-ధులియా-నాసిక్-ముంబై మార్గం
రైలు మార్గం ద్వారా... ఉజ్జయిని నుంచి మాక్షి- భోపాల్ మార్గం (ఢిల్లీ-నాగ్‌పూర్ రైలు మార్గం) ఉజ్జయిని-నగ్డా-రాట్లం మార్గం (ముంబై-ఢిల్లీ మార్గం) ఉజ్జయిని-ఇండోర్ మార్గం (ఖన్బావ లైన్-మీటర్ గేజ్ లైన్)
విమానం మార్గం ద్వారా.. ఇండోర్ విమానశ్రయం నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉజ్జయిని ఉంది.
ఎక్కడ బస చేయాలి? ఉజ్జయినిలో పలు హోటళ్లు, ధర్మశాలలు ఉన్నాయి. హర్షిద్దా కమిటీ, మహాకాల్ కమిటీలకు చెందిన ధర్మశాలలు సరసరమైన, ప్రియమైన (లక్సరీ) ధరల్లో అన్ని వర్గాల భక్తులకు అందుబాటులో లభ్యమవుతాయి.
|