ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > తీర్థయాత్ర > పుణ్యక్షేత్రాలు
 
పుణ్యప్రదం... శబరిమలయాత్ర!
WD PhotoWD
ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలలో శబరిమల ఒకటి. ఈ పుణ్యక్షేత్రాన్ని ప్రతియేటా భక్తకోటి సందర్శిస్తుంటారు. ప్రపంచంలో ఏడాదికోసారి భక్తులు సందర్శించే పుణ్య క్షేత్రాల జాబితాలో హజి్‌లోని మక్కా మసీదు ప్రథమ స్థానంలో ఉంటే.. శబరిమలది రెండోస్థానం అని చెప్పవచ్చు. గత ఏడాది నవంబరు నుంచి మొన్నటి జనవరి వరకూ ఈ ఆలయాన్ని దాదాపు ఐదుకోట్ల మంది భక్తులు సందర్శించినట్లు అంచనా.

శబరిమలలో కొలువైవున్న అయ్యప్ప స్వామి క్షేత్రం, దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచినది. కేరళ పశ్చిమ కొండ పర్వతప్రాంతాలలో కొలువై ఉన్న ఈ ఆలయానికి సమీపంలో తమిళనాడు సరిహద్దు ప్రాంతం ఉంది. మొత్తం 18 పర్వత శ్రేణుల మధ్య నెలకొన్న ఈ ప్రాంతాన్ని పూంకవనమ్ అని పిలుస్తారు. ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులు మరియు కొండలతో కూడి ఉంటుంది.

శబరిమలలో అయ్యప్ప స్వామి విగ్రహాన్ని పరశురామ మహర్షి ప్రతిష్టించినట్లు చెపుతారు. అయ్యప్ప స్వామికి సంబంధించిన ఓ కథ ప్రకారం.... శివకేశవులకు కలిగి
WD PhotoWD
సంతానం అయ్యప్పస్వామి. భస్మాసుర సంహారినికి మోహినీ అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని చూసిన శివుడు ఆమెతో సంగమిస్తాడు. వీరురివురికి ఓ అందమైన బాలుడు కలుగుతాడు.

వంశాంకురం కోసం తపస్సు చేస్తున్న పాండలం ప్రాంత రాజు ప్రార్థించే దట్టమైన అడవులలో ఆ బాలుణ్ణి వదిలి వెళతారు శివకేశవులు. ఆ అందమైన బాలుని తన సంతానంగా భావించి అతనిని అన్ని విద్యలలోనూ ఉన్నతునిగా తీర్చిదిద్దుతాడు.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శబరిమలకు సంబంధించి నవంబర్ 15న వచ్చే మండలపూజ, జనవరి 14న వచ్చే మకర‌జ్యోతి అతి ముఖ్యమైన ఘట్టాలు. వీటితోపాటు ఏప్రిల్ మాసంలో వచ్చే విషు మరియు ప్రతి మలయాళం మాసంలో మొదటి ఐదురోజులు మినహా మిగతా కాలమంతా ఆలయాన్ని మూసివేసి ఉంచుతారు.
వీడియోను వీక్షించండి
  1 | 2 | 3  >> 
చిత్రమాల
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని
శ్రీకృష్ణ నామామృతాన్ని బోధించే ఇస్కాన్ దేవాలయం
నాగచంద్రేశ్వర ఆలయ దర్శనం.. సర్వ సర్ప దోష నివారణం
త్రయంబకేశ్వరుని దర్శించి.. తరించండి
నయనానందకరం ఓంకారేశ్వరుని ఉత్సవం
మంగళనాథుని దర్శనం.. దోష నివారణం
ఉజ్జయినిలోని 'మహాకాల్ ఆలయ' ప్రాశస్త్యం